Home Top Ad

P2 : AP- Telugu Question Bank

Share:

 

Question:25

చేయకుము కాని కార్యము;
పాయకుము మఱిన్ శుభం;బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబునఁ ;
గూయకు మొరుమనసు నొచ్చుఁ గూఁత కుమారా!
-పై పద్యంలో కవి ఎవరి ఇంట భోజనం చేయొద్దన్నారు

(1) బంధువుల ఇంట
(2) తోబుట్టువుల ఇంట
(3) శత్రువుల ఇంట
(4) మిత్రుల ఇంట


Answer is : 3
#Source: APTET2024 P1 FEB27 S2

Question:26

చేయకుము కాని కార్యము;
పాయకుము మఱిన్ శుభం; బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబునఁ ;
గూయకు మొరుమనసు నొచ్చుఁ గూఁత కుమారా!
-పై పద్యంలో “అవని” అనగా

(1) భూమి
(2) అమ్మ
(3) స్త్రీ
(4) గగనం


Answer is : 1
#Source: APTET2024 P1 FEB27 S2

Question:27

ఆధునిక కవిత్వ ప్రక్రియలో ఎన్నో కవితా రూపాలు వచ్చాయి. ముత్యాల సరాలు, వచన కవిత, హైకూలు ఇలా ఎన్నో కవితా రూపాలు చూస్తాం. సజీవమైన కవిత్వం కాలానికి అనుగుణంగా తన రూపాన్ని తానే ఎంచుకుంటుంది. హైకూల తర్వాత వచ్చిన కొత్తరూపం నానీలు. నానీలలో నాలుగు పాదాలుంటాయి. -కింది వాటిలో ఆధునిక కవితా రూపాలు కానివి

(1) నానీలు
(2) హైకూలు
(3) కావ్యాలు
(4) ముత్యాల సరాలు


Answer is : 3
#Source: APTET2024 P1 FEB27 S2

Question:28

ఆధునిక కవిత్వ ప్రక్రియలో ఎన్నో కవితా రూపాలు వచ్చాయి. ముత్యాల సరాలు, వచన కవిత, హైకూలు ఇలా ఎన్నో కవితా రూపాలు చూస్తాం. సజీవమైన కవిత్వం కాలానికి అనుగుణంగా తన రూపాన్ని తానే ఎంచుకుంటుంది. హైకూల తర్వాత వచ్చిన కొత్తరూపం నానీలు. నానీలలో నాలుగు పాదాలుంటాయి. -సజీవ కవిత్వం అనేది

(1) కాలానుగుణంగా మారనిది
(2) కాలానుగుణంగా మారేది
(3) కాలంతో సంబంధం లేనిది
(4) కాలానికి అతీతమైనది


Answer is : 2
#Source: APTET2024 P1 FEB27 S2

Question:29

ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందిన వారు

(1) 17వ శతాబ్దం
(2) 18వ శతాబ్దం
(3) 19వ శతాబ్దం
(4) 20వ శతాబ్దం


Answer is : 2
#Source: APTET2024 P1 FEB27 S2

Question:30

"పినాకపాణి" అను పదమునకు అర్థం

(1) విష్ణువు
(2) ఆంజనేయుడు
(3) శివుడు
(4) కృష్ణుడు


Answer is : 3
#Source: APTET2024 P1 FEB27 S2

Question:31

"దహనుడు" పదానికి పర్యాయపదాలు

(1) అగ్నిదేవుడు, అనలం
(2) ఆవు, ధేనువు
(3) మాను, వృక్షం
(4) సముద్రం, కడలి


Answer is : 1
#Source: APTET2024 P1 FEB27 S2

Question:32

"కారు" పదానికి ప్రకృతి

(1) కారం
(2) కార్యం
(3) కాలం
(4) క్షారం


Answer is : 3
#Source: APTET2024 P1 FEB27 S2

Question:33

"దివి" పదానికి నానార్థపదాలు

(1) స్వర్గం, ఆకాశం
(2) భూమి, వసుధ
(3) ఆకాశం, నింగి
(4) నది,నీరు


Answer is : 1
#Source: APTET2024 P1 FEB27 S2

Question:34

క్రింది వానిలో జాతీయం కానిది?

(1) అన్నెం, పున్నెం
(2) కల్లా కపటం
(3) తల్లి తండ్రి
(4) ఈడు జోడు


Answer is : 3
#Source: APTET2024 P1 FEB27 S2

Question:35

మా ఊరెద్దు మీ ఊరికి పోదు - మీ ఊరెద్దు మా ఊరికి రాదు - ఏమిటది?

(1) రోకలి
(2) పుట్ట
(3) చెరువు
(4) చెట్టు


Answer is : 4
#Source: APTET2024 P1 FEB27 S2

Question:36

నామవాచక గుణాలను తెలియజేసే పదాలు

(1) క్రియలు
(2) విశేషణాలు
(3) అవ్యయాలు
(4) సర్వనామములు


Answer is : 2
#Source: APTET2024 P1 FEB27 S2

Question:37

భూత కాలానికి ఉదాహరణ

(1) చదివాడు.
(2) చదువుతున్నాడు
(3) చదువుతాడు
(4) చదవడు


Answer is : 1
#Source: APTET2024 P1 FEB27 S2

Question:38

సరయు నదీ తీరమందు కోసల దేశం ఉంది. ఈ వాక్యంలో ఏ విభక్తి ఉన్నది.

(1) తృతీయా విభక్తి
(2) పంచమీ విభక్తి
(3) సప్తమీ విభక్తి
(4) ప్రథమా విభక్తి


Answer is : 3
#Source: APTET2024 P1 FEB27 S2

Question:39

స్వల్ప విరామ చిహ్నం

(1) :
(2) ,
(3) !
(4) '


Answer is : 2
#Source: APTET2024 P1 FEB27 S2

Question:40

నిత్య బహువచనానికి ఉదాహరణ

(1) పెసలు
(2) తలలు
(3) పరుగులు
(4) కేరింతలు


Answer is : 1
#Source: APTET2024 P1 FEB27 S2

Question:41

ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది

(1) సరళ అక్షరం
(2) సంయుక్తాక్షరం
(3) ద్విత్వాక్షరం
(4) ఉభయాక్షరం


Answer is : 2
#Source: APTET2024 P1 FEB27 S2

Question:42

ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఇలా ఉంటారు.

(1) ఊష్మాలు
(2) స్థిరాలు
(3) పరుషాలు
(4) అనునాసికాలు


Answer is : 4
#Source: APTET2024 P1 FEB27 S2

Question:43

“ రాముడతడు " పదాన్ని విడదీసిన

(1) రాము + డతడు
(2) రాముడు + అతడు
(3) రాము + అతడు
(4) రాముడు + తడు


Answer is : 2
#Source: APTET2024 P1 FEB27 S2

Question:44

“మహోదధి” పదంలో ఉన్న సంధి

(1) సవర్ణదీర్ఘ సంధి
(2) గుణసంధి
(3) అత్వసంధి
(4) గసడదవాదేశసంధి


Answer is : 2
#Source: APTET2024 P1 FEB27 S2

Question:45

" ముల్లోకాలు " సమాసాన్ని గుర్తించండి

(1) ద్వంద్వ సమాసం
(2) ద్విగు సమాసం
(3) కర్మధారయసమాసం
(4) తత్పురుష సమాసం


Answer is : 2
#Source: APTET2024 P1 FEB27 S2

Question:46

“నదీ” పదంలో ఉన్న గణం

(1) “ లగ " ము
(2) “ గల " ము
(3) “ లల " ము
(4) “ గగ " ము


Answer is : 1
#Source: APTET2024 P1 FEB27 S2

Question:47

బావిలోకి తొంగిచూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలో అలంకారం

(1) అతిశయోక్తి అలంకారం
(2) అంత్యాను ప్రాస అలంకారం
(3) వృత్యాను ప్రాస అలంకారం
(4) రూపక అలంకారం


Answer is : 1
#Source: APTET2024 P1 FEB27 S2

Question:48

క్రియారహిత వాక్యానికి ఉదాహరణ

(1) జాన్‌ సినిమా చూస్తున్నాడు.
(2) పాప పాలు తాగింది.
(3) అతను మంచి ఆటగాడు.
(4) శారద టిఫిన్‌ తిన్నది, కాఫీ తాగింది.


Answer is : 3
#Source: APTET2024 P1 FEB27 S2


See Video : Click here 
Write Test : Click here

No comments

Please comment..(Any wrong question/Suggestion or any thing)