Home Top Ad

P3 : AP- Telugu Question Bank

Share:

Question:49

గార్ధభంబున కేల - కస్తూరి తిలకంబు మర్కటంబునకేల - మలయజంబు
శార్దూలమున కేల- శర్కరాపూపంబు సూకరంబున కేల - చూత ఫలము
మార్జాలమునకేల - మల్లెపువ్వుల బంతి గుడ్ల గూబకు నేల - కుండలములు
మాహిషంబున కేల - నిర్మల వస్తముల్‌ బక సంతతికి నేల - పంజరంబు
-పై పద్యములో చూత ఫలము అనగా

(1) మామిడి పండు
(2) చింతకాయ
(3) జామపండు
(4) నారింజపండు


Answer is : 1
#Source: APTET2024 P1 FEB28 S1

Question:50

గార్ధభంబున కేల - కస్తూరి తిలకంబు మర్కటంబునకేల - మలయజంబు
శార్దూలమున కేల- శర్కరాపూపంబు సూకరంబున కేల - చూత ఫలము
మార్జాలమునకేల - మల్లెపువ్వుల బంతి గుడ్ల గూబకు నేల - కుండలములు
మాహిషంబున కేల - నిర్మల వస్తముల్‌ బక సంతతికి నేల - పంజరంబు
-సుగంధము దీనికి అవసరమా అని ఏ జంతువు గురించి చెప్పారు

(1) గాడిద
(2) పిల్లి
(3) కోతి
(4) పులి


Answer is : 3
#Source: APTET2024 P1 FEB28 S1

Question:51

విజయ రాఘవ నాయకుడు అనేక నాటకాలు, ద్విపద కావ్యాలు, దాదాపు 60 రచనలు చేశాడు. భక్తుడు, పద సాహిత్య సృష్టికర్త క్షేత్రయ్య ఈ యుగంలోని వాడే, క్షేత్రయ్య అసలు పేరు మువ్వ వరదయ్య. క్షేత్రయ్య పదాలు కనీసం 4500 ఉండి ఉండవచ్చు. కాని 400కు మించి లభించటం లేదు. రంగాజమ్మ ఈ కాలంలోని కవయిత్రి. 'ఉషాపరియణం', 'మన్నారు దాస విలాసం' అనే నాటకం ఇంకా అనేక రచనలు చేసింది. నారాయణ తీర్థుడు, సిద్దేంద్ర యోగి ఈ కాలంలో వారే.

"మన్నారు దాస విలాసం" రచించినది?

(1) సిద్దేంద్రయోగి
(2) మన్నారు దాసు
(3) క్షేత్రయ్య
(4) రంగాజమ్మ


Answer is : 4
#Source: APTET2024 P1 FEB28 S1

Question:52

విజయ రాఘవ నాయకుడు అనేక నాటకాలు, ద్విపద కావ్యాలు, దాదాపు 60 రచనలు చేశాడు. భక్తుడు, పద సాహిత్య సృష్టికర్త క్షేత్రయ్య ఈ యుగంలోని వాడే, క్షేత్రయ్య అసలు పేరు మువ్వ వరదయ్య. క్షేత్రయ్య పదాలు కనీసం 4500 ఉండి ఉండవచ్చు. కాని 400కు మించి లభించటం లేదు. రంగాజమ్మ ఈ కాలంలోని కవయిత్రి. 'ఉషాపరియణం', 'మన్నారు దాస విలాసం' అనే నాటకం ఇంకా అనేక రచనలు చేసింది. నారాయణ తీర్థుడు, సిద్దేంద్ర యోగి ఈ కాలంలో వారే.

-పద సాహిత్య సృష్టికర్త?

(1) విజయ రాఘవ నాయకుడు
(2) క్షేత్రయ్య
(3) నారాయణ తీర్థుడు
(4) రంగాజమ్మ


Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S1

Question:53

"కొండ వాగు" పాఠం ఇతివృత్తం

(1) పర్యావరణం
(2) సంస్కృతి, సంప్రదాయాలు
(3) ప్రకృతి వర్ణన
(4) పఠనాభిలాష


Answer is : 3
#Source: APTET2024 P1 FEB28 S1

Question:54

' కశ్మలం ' అను పదానికి అర్థం

(1) ఆసక్తి
(2) కోరిక
(3) మలినం
(4) కారణం


Answer is : 3
#Source: APTET2024 P1 FEB28 S1

Question:55

'ఫాలాక్షుడు' పర్యాయపదాలు

(1) విష్ణువు, హరి
(2) ఆంజనేయుడు, మారుతి
(3) బ్రహ్మ, చతుర్ముఖుడు
(4) శివుడు, హరుడు


Answer is : 4
#Source: APTET2024 P1 FEB28 S1

Question:56

కాంక్ష' పదానికి వికృతి

(1) కాంచ
(2) కుచ్చు
(3) కాచు
(4) కచ్చు


Answer is : 4
#Source: APTET2024 P1 FEB28 S1

Question:57

చీర పదానికి నానార్థపదాలు

(1) గోచి,రేఖ
(2) గోచి కన్ను
(3) నింగి, ఆకాశం
(4) కీర్తి, గౌరవం


Answer is : 1
#Source: APTET2024 P1 FEB28 S1

Question:58

భాషకు సంబంధించిన విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులను ఏమంటారు

(1) నానార్ధములు
(2) పర్యయపదాలు
(3) వ్యుత్పత్తి అర్థాలు
(4) జాతీయాలు


Answer is : 4
#Source: APTET2024 P1 FEB28 S1

Question:59

నిద్రలో కూడా కన్నులు మూయనిది - ఏమిటిది?

(1) పేను
(2) తేలు
(3) చేప
(4) కుందేలు


Answer is : 3
#Source: APTET2024 P1 FEB28 S1

Question:60

పేరుకు బదులుగా వాడేపదం

(1) నామవాచకం
(2) సర్వనామం
(3) క్రియ
(4) విశేషణం


Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S1

Question:61

'వర్తమాన కాలం' అనగా

(1) జరిగిపోయిన కాలం
(2) జరుగుతున్న కాలం
(3) జరగబోయే కాలం
(4) శీతాకాలం


Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S1

Question:62

క్రింది వానిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు

(1) వలన(న్‌), కంటె(న్‌), పట్టి
(2) ని(న్‌), ను(న్‌), ల(న్‌), కూర్చి, గురించి
(3) కొఱకు(న్‌), కై
(4) అందు(న్‌), న(న్‌)


Answer is : 1
#Source: APTET2024 P1 FEB28 S1

Question:63

వాక్యాంత బిందువును ఏమంటారు

(1) స్వల్ప విరామం
(2) పూర్ణ విరామం
(3) ఆశ్చర్యార్థకం
(4) ప్రశ్నార్థకం


Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S1

Question:64

ఈ క్రింది వానిలో నిత్యబహువచనం కానిది

(1) వడ్లు
(2) కేరింతలు
(3) కందులు
(4) పెసలు


Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S1

Question:65

స్‌+త్‌ +ర్‌+ అ = ?

(1) స్త్ర
(2) త్ర
(3) శ్త్ర
(4) సత్ర


Answer is : 1
#Source: APTET2024 P1 FEB28 S1

Question:66

కింది వాటిలో ఊష్మాలు

(1) క, చ, ట, త, ప
(2) శ, ష, స, హ
(3) ఒ, ఓ, ఔ
(4) గ,జ,డ,ద,బ


Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S1

Question:67

"వచ్చినందుకు" పదాన్ని విడదీయండి.

(1) వచ్చి + నందుకు
(2) వచ్చినందు +కు
(3) వచ్చిన + అందుకు
(4) వచ్చినం + దుకు


Answer is : 3
#Source: APTET2024 P1 FEB28 S1

Question:68

అకారమునకు “ఇ, ఉ, ఋ ” లు పరమైతే క్రమంగా “ఏ, ఓ, అర్‌” లు వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది.

(1) వృద్ధిసంధి
(2) సవర్ణ దీర్ధసంధి
(3) గుణసంధి
(4) అత్వసంధి


Answer is : 3
#Source: APTET2024 P1 FEB28 S1

Question:69

'వాయుపుత్రుడు' ఏ సమాసం

(1) సప్తమీ తత్పురుష సమాసం
(2) షష్టీ తత్పురుష సమాసం
(3) ద్వంద్వ సమాసం
(4) ద్విగు సమాసం


Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S1

Question:70

మూడు గురువులు - ఉన్న గణం

(1) “ మ ” గణం
(2) “ న " గణం
(3) “ త " గణం
(4) ర గణం


Answer is : 1
#Source: APTET2024 P1 FEB28 S1

Question:71

అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది

(1) వృత్త్యనుప్రాస అలంకారం
(2) అంత్యానుప్రాస అలంకారం
(3) అతిశయోక్తి అలంకారం
(4) రూపక అలంకారం


Answer is : 2
#Source: APTET2024 P1 FEB28 S1

Question:72

అసమాపక క్రియకు ఉదాహరణ

(1) చేసాడు
(2) రాస్తుంది
(3) రాసి
(4) వచ్చింది


Answer is : 3
#Source: APTET2024 P1 FEB28 S1


See Video : Click here 
Write Test : Click here

No comments

Please comment..(Any wrong question/Suggestion or any thing)